కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సుభిక్షత నెలకొనాలని వరుణదేవుని ప్రార్థిస్తూ తిరుమలలో కారీరిష్ఠి యాగంను నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు గోగర్భం తీర్థం చెంత గల పార్వేట మండపంలో కారీరిష్ఠి యాగాన్ని తలపెట్టారు. వరుణయాగం నిర్వహణలో నిపుణులైన ఋత్వికుల సమక్షంలో ఈ యాగం జరగనుంది. యాగంలో భాగంగా 5 రోజుల పాటు ప్రముఖ పండితులచే తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణము, ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేయనున్నారు.
తిరుమలలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వరుణ జపం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 18వ తారీఖున పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగుస్తుంది.