ETV Bharat / state

డీజీపీ లేఖ అప్రజాస్వామికం: వర్ల రామయ్య - news on dgp letter to chandra babu

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ రాసిన లేఖ అప్రజాస్వామికమని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన లేఖకు ప్రతిగా మరో లేఖను డీజీపీకి రాశారు.

varla ramaiyya comments on dgp
డీజీపీకి వర్ల రామయ్య లేఖ
author img

By

Published : Oct 1, 2020, 11:27 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ రాసిన లేఖపై ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. డీజీపీ గౌతం సవాంగ్​కు బహిరంగా లేఖ రాశారు. డీజీపీ రాసిన లేఖ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్–19(1)(ఏ) స్ఫూర్తికి డీజీపీ రాసిన లేఖ పూర్తి వ్యతిరేకమన్నారు. రామచంద్రపై దాడికేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయమని అడిగితే, సాక్ష్యాలు సీల్డ్ కవర్ లో పంపమని ఎద్దేవా చేస్తారా అని ప్రశ్నించారు.

రామచంద్రపై దాడికేసులో ముద్దాయి ప్రతాపరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందినవాడని చెప్పడానికి డీజీపీ దగ్గర ఉన్న సాక్ష్యాలేంటన్నారు. పలుదఫాలు హైకోర్ట్ తప్పుపట్టినా, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా.. డీజీపీ బరి దాటి ప్రతిపక్షనేతకు లేఖ రాయడం అభ్యంతరకరమని వర్ల అన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో ఎస్సీలపై పెరిగిన నేరాలు.. మహిళలపై దాడులూ అత్యధికం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.