చిత్తూరులో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను వారి స్వస్థలాలకు అధికారులు పంపించారు. చిత్తూర జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలలో ఉన్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైలులో తరలించారు. 1300 మంది వలస కార్మికులతో చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది.
కార్మికులందరికీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే రైలులోకి అనుమతించారు. అందరికీ భోజనం, నీటి బాటిళ్లను అందజేశారు. రైలులో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రామిక్ రైలు ద్వారా వలస కార్మికులను తరలించే అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: