ఓటు హక్కు వినియోగించుకునేందుకు రక్షణ కల్పించాలని.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు ఎస్సీ కాలనీవాసులు కోరారు. తమ పంచాయతీని పురపాలక సంఘంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు తీర్మానించారు.
ఇదీ చదవండి: బంగాల్: మధ్యాహ్నం 1.30 వరకు 55 శాతం పోలింగ్
ఇదే విషయంపై 2 రోజుల కిందట గ్రామంలో దండోరా వేయించారు. ఈ నేపథ్యంలో ఊరందూరులో ఓటు వేసేందుకు ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఇదిలావుంటే ఓటు హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని భావించి.. పోలింగ్లో పాల్గొనేందుకు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ కాలనీవాసులు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: