తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రికి అనుబంధంగా కళాశాల మంజూరుకు సహకరిస్తామని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా....బర్డ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన... ఆసుపత్రి వర్గాలతో కలసి వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఆత్యాధునిక పరికరాల పనితీరు గురించి...వైద్యులు కేంద్ర మంత్రికి వివరించారు. తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్స్ సేవలు అద్భుతమని థావర్ కితాబునిచ్చారు. కేంద్రం తరపున ఆసుపత్రి ఆధునీకరణ, వైద్యపరికరాల కోసం సహయ సహకారాలు అందిస్తామని గెహ్లోత్ స్పష్టం చేశారు. అనంతరం.... రాస్ సేవా సమితి ఆధ్వర్యంలో...మహిళలకు కారు డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు మహిళల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఇదీ చూడండి: