చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారు భాకరాపేటకు చెందిన మధు(45), ఎల్లమ్మగూడకు చెందిన రమణయ్య(48) గా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి జ్యుడిషీయల్ రిమాండ్కు తరలించినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి