చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలూరు నుంచి శ్రీనివాసమంగాపురం వద్ద బీజీఆర్ కళ్యాణమండపానికి వెళ్లే సమీపంలో... ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు సీ.మల్లవరం పంచాయతి, కాలురు హరిజనవాడకు చెందిన వంశీ, సుబ్రహ్మణ్యంలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: