తంబళ్లపల్లె, కన్నె మడుగు, రేణుమాకులపల్లి, గ్రామాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, ముమ్మరంగా కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో ఆదివారం పూర్తిగా లాక్డౌన్ విధించారు. మృతులతో కలిపి మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి నిరంజన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కర్ణాటక, మదనపల్లె, తిరుపతి, ఇతర ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో రాకపోకలు సాగించేవారు తగు జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...