చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమ దారిలో రెండు ప్రమాదాలు జరిగాయి. బళ్లారి నుంచి చెన్నైకి రసాయనాల లోడుతో వెళుతున్న లారీ... అదుపు తప్పి దొనకోటి గంగమ్మ గుడి మలుపు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
పీలేరు నుంచి సేలంకు మామిడికాయ లోడుతో వెళుతున్న మరో లారీ... దొనకోటికి సమీపలోనే బోల్తా పడింది. లారీలోనే మామిడికాయలు పూర్తిగా నేలపాలయ్యాయి. డ్రైవర్‌కి స్వల్పగాయాలయ్యాయి. భాకరాపేట కనుమదారిలో రోడ్డు పక్కన సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో... తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: