తితిదే ఉద్యోగులకు స్విమ్స్‌లో అందుతున్న కరోనా వైద్యంపై ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలనా భవనంలో నిర్వహించిన ఈ సమీక్షలో అదనపు ఈవో, ఏవీ ధర్మారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పరస్థితిపై ఆరా తీశారు. కరోనా బారిన పడిన తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు ఖాద్రిపతి నరసింహాచార్యులు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న అంశాన్ని డాక్టర్ వెంగమ్మ వివరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.
ఇదీ చదవండి: తిరుమల దర్శనాలపై సీఎస్ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ