ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మారుస్తూ తితిదే నిర్ణయం తీసుకొంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవలు, దర్శనం, బసతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్ల సేవలు మారిన వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వస్తాయని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
గతంలో https:/ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా సేవలు అందిస్తుండగా....https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చినట్లు తితిదే తెలిపింది.మారిన వెబ్‌సైట్ ద్వారా మే 23న ఆదివారం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని...భక్తులు ఈ మార్పు గమనించాలని ప్రకటనలో తితిదే కోరింది.
ఇదీ చూడండి కోర్టులు తప్పుబట్టినా.. జగన్‌లో మార్పు లేదు'