అలిపిరి సమీపంలోని అరవింద కంటి ఆసుపత్రిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి తితిదే 7 ఎకరాల స్థలం కేటాయించినట్లు సుబ్బారెడ్డి వివరించారు. ఈ స్థలంలో అరవింద కంటి ఆస్పత్రి సంస్థ అత్యాధునిక పరికరాలతో ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఈ వైద్య సేవలను రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు విస్తృతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...