తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో, అర్చకులతో ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు తితిదేలోని వివిధ విభాగాల్లో పనిచేసే 140 సిబ్బందికి కరోనా సోకిందని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి.... ఎక్కువగా ఇతర జిల్లాల నుంచి విధులు నిర్వహించేందుకు వచ్చిన ఏపీ స్టేట్ బెటాలియన్ సిబ్బందే బాధితుల్లో ఉన్నారని తెలిపారు. పోటు సిబ్బందిలో 16 మంది, అర్చకులకు 14 మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. 140 మందిలో 70 మంది ఇప్పటికే కోలుకున్నారని... మిగతా వారికి వైద్య సేవలందిస్తున్నట్లు ఛైర్మన్ చెప్పారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల నుంచి వైరస్ సోకలేదని... వివిధ ప్రాంతాల నుంచి విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకిందని చెప్పారు. స్వామివారి కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అర్చకులతో చర్చించిన అధికారులు... వారికి విడివిడిగా గదులు, భోజన వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల దర్శనం నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సుబ్బారెడ్డి.... ఆగమ సలహాదారు రమణదీక్షితులు ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయనతోనే చర్చిస్తామని తెలిపారు. ఆయనేమైనా చెప్పాల్సి ఉంటే తితిదేకి సలహా ఇవ్వాలని సూచించారు.
ఇదీ చదవండి: