కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా దర్శనం ప్రారంభించేందుకు తితిదే సిద్దమవుతోంది. మూడో దశ లాక్ డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో తితిదే సమాయత్తమవుతోంది. ఆలయాలు తెరిచేలా లాక్ డౌన్‌లో నిబందనలు సడలించే పక్షంలో ఏ క్షణంలోనైనా స్వామివారి దర్శనం కల్పించేలా తితిదే కసరత్తులు చేస్తోంది.
భౌతికదూరం పాటించడంతో పాటు... భక్తులను దర్శనానికి అనుమతి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల వితరణ విషయాలలో తీసుకోవలసిన చర్యలపై ప్రణాలికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రంలో దూరం పాటించేలా పట్టీలను గీస్తున్నారు. తిరుమల డిపోకు చెందిన బస్సులలో సీటు నంబర్లను వేస్తున్నారు. సాదారణంగా 48 మంది ప్రయానించే బస్సుల్లో 29 మందిని మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు.