ETV Bharat / state

విషాదం నింపిన వరదలు...రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు గల్లంతు

author img

By

Published : Oct 23, 2020, 8:16 PM IST

చిత్తూరు జిల్లాలో వరదలు... రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా... మరో ఇద్దరి గల్లంతుకు కారణమయ్యాయి. వాగులో కారు కొట్టుకుపోయి... తండ్రీ, కుమార్తె గల్లంతవగా... మరోచోట డ్యామ్‌ వద్ద సెల్ఫీ తీసుకునే క్రమంలో తల్లీకుమారుడు వాగులో పడ్డారు.

విషాదం నింపిన వరదలు
విషాదం నింపిన వరదలు

పెళ్లి వేడుకలకు హాజరై ఆనందంగా గడిపిన ఆ తండ్రీ కూతురుకి అదే చివరి సంతోషపు గడియని తెలీదు. కొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకుందామనుకున్న తమకు...ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో తండ్రి గల్లంతు, కుమార్తె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. చిత్తూరు నగర శివార్లలోని వడ్డువారిపల్లెకు చెందిన ప్రతాప్‌..తన బాబాయి, భార్య, కుమార్తె సాయివినీతతో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యారు. వేడుకలు ముగిశాక స్వస్థలానికి వచ్చే క్రమంలో కొండయ్యగారిపల్లె సమీపంలో వాగు దాటుతుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రవాహ ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది.

వాగులో రెండుసార్లు తిరగబడిన కారు...చెట్టు దగ్గర ఆగిపోవడంతో ప్రతాప్‌ భార్య శ్యామల, బాబాయి క్షేమంగా గట్టుకు చేరుకున్నారు. కుమార్తె సాయివినీతను ఒడ్డుకు చేరుస్తుండగా పట్టు తప్పి వాగులోకి జారిపోయింది. కుమార్తెను కాపాడేందుకు వాగులోకి దిగిన ప్రతాప్‌..వరదలో కొట్టుకుపోయారు. కొండయ్యగారిపల్లె నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో సాయివినీత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతాప్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భర్త, కుమార్తెను పోగొట్టుకున్న శ్యామల కన్నీరుమున్నీరవుతున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలో మరో విషాదం చోటుచేసుకుంది. కౌండిన్య చెక్ డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ తల్లీకుమారుడు వాగులో పడిపోయారు. వీరిద్దరూ పలమనేరు గడ్డూరు కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు. తన కళ్లముందే భార్య, కుమారుడు గల్లంతయ్యారంటూ భర్త విలపించారు.

వేర్వేరు ఘటనల్లో గల్లంతైన వారి కోసం పోలీసులు డ్రోన్ల సాయంతో... గాలింపు చర్యలు చేపట్టారు.

విషాదం నింపిన వరదలు

ఇదీచదవండి

వజ్రపుకొత్తూరులో ముగిసిన వీరజవాన్ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.