చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని బి.కొత్తకోట పరిధిలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజల సందర్శనకు అనుగుణంగా ఇక్కడ అన్ని వసతులనూ అధికారులు ఏర్పాటు చేశారు. ఆటలు, ట్రెక్కింగ్, సాహసోపేతమైన క్రీడలు పిల్లలతో పాటు పెద్దలకూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, అన్ని వర్గాలు ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి రోజూ 500 నుంచి వెయ్యి మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: