saiteja Funeral: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు పౌర సమాజం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డీఎన్ఏ పరీక్షల అనంతరం సాయితేజను గుర్తించినా... పార్ధీవదేహం దిల్లీ నుంచి బెంగళూరుకు తరలించే సరికి నిన్న సమయం మించిపోయింది. సైనికాధికారుల నివాళుల అనంతరం బేస్ క్యాంప్ మార్చురీలో పార్థివదేహాన్ని భద్రపరిచారు. నేడు చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో కుటుంబసభ్యులకు సాయితేజ పార్థివదేహాన్ని సైనిక అధికారులు అందజేయనున్నారు. . వీర జవాన్‌కు కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల వద్దే ఘనంగా నివాళులు అర్పించి భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.
అంతిమ సంస్కారాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కు ద్వారా అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా సాయితేజ కుటుంబాన్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: