40 రోజుల సుదీర్ఘ విరామం తరువాత ఒక రోజు మాత్రమే మద్యం విక్రయించి రెండో రోజు దుకాణాలు తెరవకపోయేసరికి మద్యం ప్రియులు మద్యం షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిరుపతిలో సామాజిక దూరం లేకపోవడం.. మద్యం కోసం ఎదురుచూస్తున్న వారు మాస్కులు ధరించని కారణంగా.. పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
గడచిన 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులు రాని తిరుపతి నగరంలోని కొన్ని ప్రాంతాలను.. రెడ్ జోన్ నుంచి మినహాయించారు. ఆయా కాలనీల్లో ఉన్న 7 దుకాణాల్లో మద్యం విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రెండో రోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 316 దుకాణాల్లో మద్యం అమ్మనున్నారు. మధ్యాహ్నం 12 దాటినా దుకాణాలు తెరచుకోకపోవడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: