తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. మార్చి నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. టిక్కెట్లు పొందని భక్తులు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా సేవను వీక్షించాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన భకుల పేరిట సేవను నిర్వహిస్తారు. కల్యాణోత్సవం టిక్కెట్లు పొందిన భక్తులకు.. ఆ టిక్కెట్టుపై తిరుమల శ్రీవారి దర్శనానికి ఉచితంగా అనుమతించనున్నారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న 90 రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవాలని తితిదే భక్తులకు సూచించింది.
ఇదీ చదవండి: పర్యావరణాన్ని కాపాడేందుకు.. ఒక్క అడుగు!