నవంబర్ 23 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి. ఉత్సవ ఏర్పాట్లపై తితిదే సమీక్ష నిర్వహించింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చేపట్టాల్సిన పనులపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తితిదే జేఈవో బసంత్ కుమార్ తెలిపారు. పంచమి తీర్ధం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న క్రమంలో పోలీసులు, తితిదే భద్రతా సిబ్బంది పటిష్టచర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్థాయిలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.