ETV Bharat / state

తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్'

తిరుపతి ఐఐటీలో నేడు తిరుఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి చిత్తూరు, తమిళనాడులోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరుకానున్నారు.

tiru utsav is going to start on january 30th at tirupati iit campus
నేడు ప్రారంభం కానున్న తిరు ఉత్సవ్
author img

By

Published : Jan 31, 2020, 12:44 PM IST

నేడు ప్రారంభం కానున్న తిరు ఉత్సవ్

చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీలో నిర్వహించే తిరు ఉత్సవ్ కార్యక్రమానికి... ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణం సిద్ధమైంది. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుల్లో తలమునకలై విద్యార్థులు కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిరీక్షిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) శాశ్వత ప్రాంగణంలో తిరు ఉత్సవ్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో నిర్వహించే ఈ పండగంటే సాంస్కృతిక సంబరాలే కాకుండా... సాంకేతిక పరంగా ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు ఆన్లైన్, ఆఫ్ లైన్​లో కూడా పోటీలు నిర్వహించడం విశేషం. చిత్తూరుతో పాటు తమిళనాడులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. జనవరి 31 సాయంత్రం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.

ఇదీ చదవండి: అలరించిన చిన్నారుల ఫ్యాషన్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.