సూర్యగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయంను తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తున్నారు. రాత్రి 8.30 గంటల వరకు ఏకాంతంగా తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.
కరోనా నివారణ చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు భక్తుల అనుమతిని తితిదే నిలిపివేసింది. రేపు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తారు.
ఇదీ చూడండి. విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు