చిత్తూరులో మూడోదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మదనపల్లి డివిజన్ పరిధిలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని పది మండలాల్లో ఉదయం 8:30 గంటలకు 9.36 శాతం పోలింగ్ నమోదయింది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలో ఓటర్ స్లిప్పులపై అభ్యర్థి గుర్తులు రాయడంతో వివాదం చేలరేగింది. పది మండలాల పరిధిలోని 173 గ్రామపంచాయతీల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని 59 సమస్యాత్మక, 54 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఈ కేెంద్రాల్లో పటిష్టబందోబస్తూ నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
ఇదీ చదవండీ.. విశాఖ నగరంలో ఓటర్లు ఎలా పెరుగుతూ వచ్చారో చూశారా?