గతేడాది చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన దొంగతనం కేసును రేణిగుంట రైల్వే పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబరులో పుత్తూరు రైల్వేస్టేషన్లో కడపకు చెందిన బంగారు వ్యాపారి చౌడప్ప నుంచి దుండగులు నగదు, బంగారం, వస్తువులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు పాత నేరస్థులే దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధరించారు. వారి నుంచి రూ. 23 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..