విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరులో జరిగింది. గ్రామానికి చెందిన సతీశ్(30) పొలాల్లో నడిచి వెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మోటార్కి వెళ్లే విద్యుత్ తీగలు తగిలి సృహ తప్పి పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. సతీశ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి:
నలుగురు కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ అందకనే అంటున్న బంధువులు!