ETV Bharat / state

శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్..13 ఎర్రచందనం దుంగల స్వాధీనం

author img

By

Published : Oct 25, 2020, 2:04 PM IST

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారుల కూంబింగ్ నిర్వహించారు. శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో 15 మంది తమిళ స్మగ్లర్లు తారసపడగా....అధికారుల రాకను గమనించి వారు పారిపోయారు. 13 ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Seizure of red sandalwood in Chittoor district
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అడవులలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ చేపట్టింది. 13 ఎర్రచందనం దుంగలతో పాటు, ఓ తమిళ స్మగ్లర్లును అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నుంచి రంగంపేట అడవులలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజ్​లోని శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో దాదాపు 15 మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.

అధికారుల రాకను పసిగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. పరిసరప్రాంతాలను పరిశీలించగా... 13 ఎర్రచందనం దుంగలను, ఓ తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

330 కిలోల శ్రీ చందనం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.