చిత్తూరు జిల్లాలోని రాయలచెరువు(Rayalacheruvu dam in Chittoor district) ప్రమాదపుటంచున ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మారడంతో.. కట్టకు స్వల్పంగా గండి పడింది.
రాయల చెరువు కట్ట తెగితే.. దాని సమీపంలోని నెత్తకుప్పం, తిన్నరాజుపల్లె, పి.వి.పురం, బలజిపల్లి, గంగిరెడ్డి పల్లి, కమ్మకండ్రిగ, కమ్మపల్లి, నెన్నూరు, కొత్త నెన్నూరు, శాఖమూరి కండ్రిగ, ఎగువ నేతగిరిపల్లి, దిగువ నేతగిరిపల్లి, పాడి పేట, ముండ్లపూడి, ఒద్దిపల్లి, కుంట్రపాకం ఎస్టి కాలనీ, తనపల్లి, పద్మవల్లిపురం, నాగూరుకాలని గ్రామాలకు ముప్పు ప్రమాదం పొంచి ఉంది. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తిరుచానూరు సమీపంలోని తితిదే శ్రీపద్మావతి అతిథి గృహంతోపాటు ఆర్సీ పురం సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమకు జీవనాధారమైన పాడి పశువులను, వ్యవసాయ సామగ్రిని వదిలి వచ్చేశామని పునరావాస కేంద్రాలకు చేరుకున్న వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Persons drowning in floods: సైకిల్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు.. కాపాడిన స్థానికులు