ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం ఏర్పాట్లతో తితిదే అధికారులు స్వాగతం పలికారు.

శ్రీవారిని దర్శించిన తెలంగాణ మంత్రి
author img

By

Published : Jul 4, 2019, 1:48 PM IST

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

తిరుమలేశుడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారిని పత్యేక దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలని,.. పరస్పరం సహకరించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:'హర హర మహాదేవా'- అమర్​నాథ్ యాత్ర చిత్రాలు

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

తిరుమలేశుడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారిని పత్యేక దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలని,.. పరస్పరం సహకరించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:'హర హర మహాదేవా'- అమర్​నాథ్ యాత్ర చిత్రాలు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా నూతన కలెక్టర్ రేవు ముత్యాలరాజు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.


Body:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా నూతన కలెక్టర్ రేవు ముత్యాల రాజు గురువారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు .ముందుగా ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు శ్రీ వారి చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1995లో భీమడోలు మండలం గుండుగొలను లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశానన్నారు .తర్వాత తనకు పాలిటెక్నిక్ లో 374 ర్యాంకు వచ్చిందని పేర్కొన్నారు. తణుకులో ఇంజనీరింగ్ కళాశాలలో మూడు సంవత్సరాలు ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమో చేశానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ పరిచయాలు ఉన్నాయని తెలిపారు. తాను చదువుకున్న , ఎక్కువ పరిచయాలు ఉన్న జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు .ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఉన్న నా ప్రముఖ దేవాలయాన్ని సందర్శించి చార్జి తీసుకోవడం అలవాటని చెప్పారు .అదేవిధంగా ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్నానని, అనంతరం జిల్లా కలెక్టర్ గా చార్జి తీసుకోవడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు .


Conclusion:ఆలయ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.