చిత్తూరు జిల్లా తిరుమలలో పది అడుగుల కొండ చిలువను స్థానికులు గుర్తించారు. కల్యాణ వేదిక వద్ద రహదారికిపైకి వస్తున్న దానిని గమనించిన జనం పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పడ్డటంలో నేర్పరి అయిన బాబు దానిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. జన సంచారం తక్కువగా ఉండడంతో తరచూ అటవీ జంతువులు, పాములు రహదారులపైకి వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..: పెద్దలొద్దన్నా... ప్రేమే ముఖ్యమని ఒకటయ్యారు