తిరుపతి పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్.. శ్రీనివాస మంగాపురం వెళ్లారు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. గవర్నర్ రాక సందర్భంగా శ్రీనివాస మంగాపురంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి రానున్న నేపథ్యంలో.. గవర్నర్ అక్కడికి చేరుకున్నారు.
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ - governor
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. తిరుపతిలో పర్యటిస్తున్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.