విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన - crime news at chittoor dst
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు చంద్రశేఖర్రెడ్డి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చిత్తూరు జిల్లా జంగంపల్లిలో జరిగింది. టీచర్ వికృత చేష్టలు భరించలేని బాలిక... కుటుంబసభ్యులకు చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Intro:* 6వ తరగతి విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించిన.. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గోరంట్లపల్లి పంచాయతీ జంగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు . ఉపాధ్యాయుడు గత కొన్ని రోజులుగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఆయన వికృత చేష్టలను భరించలేని బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న విద్యార్థులు తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు మేరకు పాఠశాల, గ్రామం లో కూడా విచారించినట్లు ఎస్ఐ తెలిపారు.
* పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు చంద్రశేఖర్రెడ్డి
note... విజువల్స్ ఈటీవీ ఏపీ వాట్సాప్ లో ఫోటో విజువల్ పంపించాను వాడుకోగలరు.