ETV Bharat / state

KUPPAM ELECTIONS: కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత - వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందంటూ వీడియోలు విడుదల

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులను ఏజెంట్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మున్సిపాలిటీలోని పలు చోట్ల వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందంటూ తెదేపా కొన్ని వీడియోలను విడుదల చేసింది.

tdp-released-videos-of-ycp-stealing-vots-in-kuppam-muncipality-elections
కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు యత్నం.. పెనుగొండలో ఉద్రిక్తత
author img

By

Published : Nov 15, 2021, 11:16 AM IST

Updated : Nov 15, 2021, 1:50 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. 24 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. 16వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ స్థానికేతరులను గుర్తించిన తెలుగుదేశం ఏజంట్లు... వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తర్వాత వారిని పోలీసులు వదిలివేశారు. దీనికి నిరసనగా తెలుగుదేశం శ్రేణులు పోలింగ్ కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. స్థానికేతరులను పోలింగ్‌ కేంద్రాల నుంచి పంపించి వేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత

16వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. జనరల్‌ ఏజెంట్‌ను పోలింగ్‌ కేంద్రం నుంచి పోలీసులు పంపించి వేశారు. దీనిపై తెలుదేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 18, 19వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. యువకులను కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు కుప్పంలోని కొత్తపేట జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి స్లిప్పులు ఇస్తున్నారంటూ తెదేపా శ్రేణులు నిరసన తెలియజేశాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

దొంగ ఓట్లు వేయించారు.. అడిగితే దాడి చేశారు..!

అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పోలింగ్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రయత్నించగా.. అక్కడే ఉన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారికి సర్దిజెప్పి అక్కడి నుంచి పంపించారు.

దొంగ ఓట్లు వేసిన వారిని పట్టుకుంటున్న పోలీసులు

వీడియోలను బయటపెట్టిన తెదేపా..

కుప్పం మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో అధికార వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందంటూ తెదేపా కొన్ని వీడియోలను విడుదల చేసింది. తంబాలపల్లి, తుంగనూరు ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున స్థానికేతరులను కుప్పానికి తీసుకువచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. దొంగ ఓట్లు వేసుందుకు వచ్చేవారు అడిగితే తమ గుర్తింపు కార్డులు చూపించకపోగా.. తప్పించుకు పారిపోతున్నారంటూ వీడియోలను తెదేపా నేతలు బయటపెట్టారు.

దొంగ ఓట్లు వేయించారు.. అడిగితే దాడి చేశారు..

కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేసిన స్థానికేతరులను ప్రశ్నించిన తెదేపా నాయకుడిపై.. వైకాపా నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని తెదేపా నాయకులు తెలిపారు.

ఇదీ చూడండి: స్థానిక సంస్థల పోలింగ్ ప్రారంభం..

Last Updated : Nov 15, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.