శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో అశ్లీల చిత్రాల లింకులు రావడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుపతిలో అలిపిరి వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీ వారి సొమ్ముతో ఉద్యోగులు జల్సా చేయడమే కాకుండా.. కోట్ల మంది వీక్షించే భక్తి ఛానల్లో అశ్లీల లింకులు పెట్టడం ఏంటని తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ప్రశ్నించారు. దీనిపై తితిదే ఈవో, ఛైర్మన్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: భాను ప్రకాశ్ రెడ్డి