ETV Bharat / state

'సేవ్ అమరావతి సేవ్ ఏపీ' నినాదాలతో తెదేపా నేతల నిరసన - tdp leaders protest with slogans news

ఏపీ రాజధాని ఏది అని పక్క రాష్ట్రాల వాళ్లు అడిగితే మూడు రాజధానులని..సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల కేంద్రంలో తెదేపా బాధ్యులు హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్​ కట్టి మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజల్లో అయోమయం నెలకొందని వాపోయారు. రాష్ట్రానికి ఒకటే రాజధానిగా అమరావతిని ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సేవ్ అమరావతి సేవ్ ఏపీ, మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నాయకులు నినాదాలు చేశారు.

latestnews tdp leaders protest with slogans
'సేవ్ అమరావతి సేవ్ ఏపీ' నినాదలతో తెదేపా నేతలు నిరసన
author img

By

Published : Jan 23, 2020, 8:15 AM IST

రాజధానిగా అమరావతే ఉండాలని తెదేపా నేతల డిమాండ్​

రాజధానిగా అమరావతే ఉండాలని తెదేపా నేతల డిమాండ్​

ఇదీ చదవండి:

పెదనందిపాడులో బంద్.. నిర్మానుష్య వాతావరణం

Intro:ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని పక్క రాష్ట్రాల వాళ్లు అడిగితే మూడు రాజధానులు అంటూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెలుగు ప్రజలకు దాపురించిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో నియోజకవర్గ తెదేపా బాధ్యులు హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్ తో కట్టి మౌనదీక్ష చేపట్టారు.


Body:రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజల్లో అయోమయం నెలకొంది అని సరైన పద్ధతి కాదంటూ హరికృష్ణ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేంత వరకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


Conclusion:మూడు రాజధానులు పేరిట ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ చిచ్చు రేపడం ప్రభుత్వం చేపడుతున్న పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. సేవ్ అమరావతి సేవ్ ఆంధ్ర ప్రదేశ్, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నాయకులు నినాదాలు చేశారు. మహేంద్ర, ఈటీవి భారత్, జి డి నెల్లూరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.