పరిషత్ ఎన్నికల్లో... వైకాపా తీరుపై చంద్రగిరిలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి కుమార్ రాజా రెడ్డి, తెదేపా మండల అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత కారణంగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అధికారులను, ప్రజలను అనేకరకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా విచ్ఛలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలను దౌర్జన్యంగా నిర్వహించడం ఎంతమాత్రం సరికాదని చెప్పారు. ఇప్పుడు ఎస్ఈసీ నీలం సాహ్ని.. వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. వాలంటీర్లు... ఓటర్లను తరలించడం ఏమిటని అధికారులను ఆయన ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
చిత్తూరులో ప్రశాంతంగా పోలింగ్.. చంద్రగిరిలో వైకాపా నేత గందరగోళం