చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనధికారికంగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాల ఏర్పాటు పై ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని శాప్ మాజీ ఛైర్మన్ పీ ఆర్ మోహన్ డిమాండ్ చేశారు. ఆలయాన్ని పరిరక్షించాలని రాజగోపురం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అధికారుల ప్రమేయంతోనే అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆలయ అధికారులతో విచారణ చేపడితే న్యాయం జరగదని వాపోయారు. ఈవోను విధుల నుంచి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కోరారు.
ఇదీ చదవండి: 'శ్రీకాళహస్తి విగ్రహాల వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ చేయాలి'