"హిందూ ద్రోహులారా... అభినవ రాక్షసులారా... చివరికి మీ గతి అధోగతే" అంటూ అధికారి పార్టీ నాయకులపై తెదేపా నేత, శాప్ మాజీ ఛైర్మన్ పి.ఆర్ మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ... వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న అధికార పార్టీ నేతలకు భిక్షాటన గతే అని అన్నారు. హిందువుల పట్ల అధికార పార్టీ తీరును నిరసిస్తూ... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఎదురుగా రాక్షస ప్రతిమలతో నిరసన చేపట్టారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన 15నెలల్లో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. సంప్రదాయాలను పరిరక్షించాల్సిన నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం తగదన్నారు. స్థానిక ఆలయంలో కొత్తగా విగ్రహాల ఏర్పాటు ఘటనలో ఆలయ ఈవోను ఇప్పటివరకు విధుల నుంచి తొలగించకపోవడం దారుణమని ఆగ్రహించారు. అనంతరం భక్తుల చేత రాక్షస ప్రతిమల వద్ద భిక్షం వేయించారు.
ఇదీ చూడండి: