ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధిస్తాం..: పరిటాల శ్రీరామ్ - thirupathi parliament elections

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్​ అన్నారు. నగరంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వైకాపా వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

tdp leader paritala sriram
తెదేపా నేత పరిటాల శ్రీరామ్
author img

By

Published : Apr 11, 2021, 12:40 PM IST

గడిచిన 22 నెలల కాలంలో నకిలీ మద్యం, ఇసుక అక్రమ రవాణాకే వైకాపా ప్రభుత్వం పరిమితమైందని తెదేపా నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. తిరుపతి తెదేపా ఎంపీ అభ్యర్ధి పనబాకలక్ష్మి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. నగరంలోని 42, 43, 44 డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ.. కరపత్రాలు పంపిణీ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదా అంశాన్ని దిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారన్న శ్రీరామ్.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

ఇవీచదవండి.

తిరుపతిలో తెదేపా గెలిస్తే మా ఎంపీలు రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

క్రెడిట్ కార్డును పొందలేకపోతున్నారా? ఇది మీ కోసమే..

ఉగాదికి బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.