జుట్టు పన్ను తప్ప అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ...వైకాపా పాలన కొనసాగిస్తోందని తిరుపతి తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ విమర్శించారు. ఇంటి, ఆస్తిపన్నులు వసూలు చేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకోవటంపై ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పన్నులతో ప్రజలను హింసిస్తోందని ఆక్షేపించారు. పారిశుద్ధ్య నిర్వహణ సరగా లేకపోవటం వల్లే ప్రజలు అనారోగ్యసమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైకాపా నేతలు ప్రజాసంక్షేమంపై కాకుండా వ్యక్తిగత ఆదాయాలపైనే దృష్టి సారించారని విమర్శించారు.
ఇదీచదవండి