ETV Bharat / state

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన - chandrababu naidu latest tour

సుదీర్ఘ విరామం అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు... గురువారం నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అధిక స్థానాల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్లు వెలువడిన ఫలితాల విశ్లేషణల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

tdp leader chandrababu naidu kuppam tour from tomorrow to three days
రేపటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన
author img

By

Published : Feb 24, 2021, 10:47 PM IST

Updated : Feb 25, 2021, 3:46 AM IST

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సహా.. కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపటమే లక్ష్యంగా చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కుప్పం చేరుకుంటారు. గుడుపల్లె మండలం రాళ్లగంగమ్మ ఆలయం వద్ద కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కుప్పానికి చేరుకుని.. గ్రామీణ మండల కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి కుప్పంలోనే బస చేయనున్నారు. శుక్ర, శనివారాల్లోనూ రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల నాయకులతో.. సమావేశం అవుతారు. మూడు రోజుల విస్తృతస్థాయి సమావేశాల్లో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. శనివారం కుప్పం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇదీచదవండి.

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి.. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు

Last Updated : Feb 25, 2021, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.