ETV Bharat / state

ఆంక్షల మధ్యే రెండో రోజు చంద్రబాబు కుప్పం పర్యటన

Chandrababu 2nd Day Kuppam Tour: వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో రాష్ట్రంలో అప్రకటిత అత్యయికస్థితి నడుస్తోందని మండిపడ్డారు. జగన్‌ చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులకు పోలీసులు సహకరిస్తే.. ఆ తర్వాత జరిగే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jan 6, 2023, 7:15 AM IST

Updated : Jan 6, 2023, 7:31 AM IST

Chandrababu 2nd Day Kuppam Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజూ పోలీసుల ఆంక్షల మధ్యే చంద్రబాబు పర్యటన సాగింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న చంద్రబాబు.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి వస్తున్న ప్రజాదరణ చూసే.. తన పర్యటనలు అడ్డుకోవడానికి చీకటి జీవోలు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ రోడ్‌షోలు, సభలు నిర్వహంచలేదా అని ఆయన ప్రశ్నించారు. మా సమావేశాలను దెబ్బతీసి, మేం బయటకు రాకూడదనే లక్ష్యంతో పోలీసులే కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అందులో బాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి విధించే పరిస్థితికొచ్చారు.. ఎవడు కనపడితే వాడిపై కేసులు పెట్టి, నేరుగా జైల్లో పెట్టేస్తారా మీరు.. కొంతమంది పోలీస్​ అధికారులు వాళ్ల స్వార్ధం కోసం ఒక ఉన్మాది, ఒక సైకో, ఒక స్యాడిష్ట్ ..ఇవన్నీ చేస్తావుంటే మీకు కుటుంబాలు ఉన్నాయి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు కూడా ముందుకు రావాలి..మేము చేసే పోరాటం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయకూడదని ఉద్దేశ్యంతో మేము పోరాడుతున్నాము.. టీడీపీ అధినేత చంద్రబాబు

రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకో ఇది బిగినింగ్ మాత్రమే.. నీ పని పుంగనూరులో కూడా చూస్తాను.. నీ తడాకా ఎంటో చూస్తా.. నేను రెచ్చగొట్టానా, మా మీద తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతూ.. నువ్వొక సైకోకు సైకో కింద తయారయ్యావా నువ్వు.. అదే నేను అనుకుంటే 14 ఏళ్లు ఈ జిల్లాలో నువ్వు తిరిగే వాడివా ఈ జిల్లాలో.. గుర్తు పెట్టుకో కబర్దార్.. ఇదే కుప్పంలో 50కోట్లు అడుగుతావా నువ్వు..బెదిరిస్తున్నాడు..బెదిరిస్తే వదిలిపెడతానా ..ఆ 50కోట్లు ఖర్చు పెడితే అంతటినీ టేక్​ఓవర్​ చేస్తాను. ఏవడైనా గాని డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు

జగన్‌కు ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టిన పోలీసులుపై ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తొలిరోజు స్వాధీనం చేసుకున్న చైతన్య రథాన్ని పోలీసులు తీసుకురాకపోవడాన్ని నిరసిస్తూ.. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించే ఎమ్​ఎమ్​. మహల్‌ వరకు చంద్రబాబు పాదయాత్ర చేశారు. సుమారు అర కిలోమీటరు మేర ఆయన కాలినడకన పలమనేరు-క్రిష్ణగిరి జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లారు. తమ పార్టీ కార్యర్తలపైనే పోలీసులు లాఠీఛార్జి చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. పుంగనూరు, తంబళ్లపల్లెలో అరాచకాలకు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

కుప్పంలో అక్రమ పద్ధతిలోనైనా గెలవడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని.. నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సెక్షన్‌, బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌, పంచాయతీ పార్టీల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకు ప్రజలు షాక్‌ ఇవ్వడం ఖాయమని చంద్రబాబు పార్టీ శ్రేణులతో చెప్పారు. బుధవారం పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్యామల, కార్యకర్తలు పవుళారాణి, హరీష్‌ను చంద్రబాబు పరామర్శించారు.

ఆంక్షల మధ్యే రెండో రోజు చంద్రబాబు కుప్పం పర్యటన

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.