శ్రీవారి దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమల కొండపైనే బస చేసి.. శుక్రవారం ఉదయం సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా ఏప్రిల్ 11న (శుక్రవారం) స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీజేఐ హోదాలో తిరుమలకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి.. తితిదేకు పర్యటన వివరాలు అందాయి. ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
ఇవీ చదవండి: