కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతరలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి