చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అనితారాణిని వైకాపా కార్యకర్తలు వేధించారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కాల్ రికార్డింగ్స్పై ప్రభుత్వం స్పందించింది. మార్చి 22న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తోన్న తనను వైకాపా నేతలు గదిలో బంధించి.. దుర్భాషలాడారని డా.అనితారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పట్టించుకోలేదని వైద్యురాలు అనితారాణి.. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో ఫోన్లో చెప్పారు. వైద్యురాలు తన ఆవేదన చెప్పుకున్న కాల్ రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అనితారాణి సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని సీఐడీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇదీ చదవండి: