ఇదీ చదవండి: 'ప్రత్యక్షంగా చేయలేని దానిని... పరోక్షంగా చేస్తున్నారు'
శ్రీవారి భక్తులకు సర్వదర్శన కష్టాలు.. చెట్ల కిందే పడిగాపులు - తితిదే వార్తలు
Devotees suffering in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు.. తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూణ్నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. దర్శన అవకాశం ఇచ్చిన రోజే తిరుమలకు అనుమతిస్తామని తేల్చిచెబుతుండటంతో.. ఇటు తిరుపతిలో ఉండలేక, తిరిగి సొంతూళ్లకు వెళ్లలేక అల్లాడిపోతున్నారు. హోటళ్లలో బస చేసే స్థోమత లేనివారు.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని చెట్ల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Devotees suffering in Tirumala