కనుమ పండుగను పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవారులు ఘనంగా కైలాసగిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ అలంకార మండపంలో బయలుదేరిన ఆది దంపతులు ఉత్సవంగా 18 కిలోమీటర్లు కైలాసగిరి ప్రదక్షిణ చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని.. అడుగడుగున స్వామి అమ్మవార్లకు భక్త జనం ఘనస్వాగతం పలికి, హారతులు పట్టారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్ల వెంట నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు.
ఇవీ చూడండి...