ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కరోనా కలకలం.. మూడు రోజుల్లో 18 కేసులు నమోదు! - శ్రీకాళహస్తిలో కరోనా కలకలం

చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల్లో 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.

srikalahastilo  karona  perugudhala
శ్రీకాళహస్తిలో కరోనా కలకలం..
author img

By

Published : Jul 14, 2021, 12:23 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీ కాళహస్తిలోని పలు వీధులను రెడ్​జోన్లుగా ప్రకటించారు.

ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బహదూర్ పేట,కంట వీధి పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల్లో 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

godavari flood: పాపం నిర్వాసితులు... కొండమీదే తలదాచుకున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.