చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో ఈనెల 16 నుంచి 28 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ కృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్న విలువైన ఆభరణాలను బ్రహ్మోత్సవాల సమయంలో అలంకరించనున్నారు. వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంభీకా దేవి అమ్మవారితో పాటు పరివార దేవతామూర్తులు స్వర్ణాభరణాల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్యాంకు లాకర్లో దాచిన ఆభరణాలను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజారులు ఆలయానికి తీసుకొచ్చారు. ఆభరణాల అలంకరణలో స్వర్ణ వాహనాలపై అది దంపతులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి ఆనుకొని స్వర్ణముఖి నది తీరాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా... ధూర్జటి కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీచూడండి.తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు