విద్యుత్ కాంతులతో ముస్తాబైన శ్రీకాళహస్తి - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీ ఆలయం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయం విద్యుద్దీపకాంతులతో ముస్తాబయింది. ఆలయంతో పాటు గోపురాలు, పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో శ్రీకాళహస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రూపాల్లోని స్వామి, అమ్మవార్ల కటౌట్లు, స్వాగత ద్వారాలు విద్యుత్ దీపాలతో సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఈ రోజునుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.