చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు ఉపయోగించే బంగారు వాహనాలు, రథాలను సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీచదవండి.